హైదరాబాద్ : ద్రోణాచార్య అవార్డు గెల్చుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ ను ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అభినందించారు. ఆలిండియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కు ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు గోపీచంద్ శుక్రవారం వైఎస్ క్యాంపు కార్యాలయానికి వెళ్ళారు. సిఎమ్ ను కలిసిన గోపీచంద్ కు ఆయన అభినందనలు లభించాయి.