25 వరకు ఎంసెట్ కౌన్సెలింగ్
హైదరాబాద్: ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ లో తలెత్తిన లోపాల వల్ల వెబ్ కౌన్సెలింగ్ గడువును పెంచాలని సాంకేతిక ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. వెబ్ కౌన్సెలింగ్ ను ఆగస్టు 25 వరకు పొడగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి కెసి రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం వెబ్ కౌన్సిలింగ్ కేంద్రాల వద్ద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాంకేతిక లోపాలతో సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులను వెబ్ కౌన్సెలింగ్ వెతలు హడలెత్తిస్తున్నాయి. మొదటి రోజే కంప్యూటర్లు మొరాయించడం, ఆప్షన్ల ఎంపికలో గందరగోళం నెలకొనడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. రెండో రోజైన సరిగా ఉంటుందన్న ఆశతో వచ్చిన విద్యార్థులకు తీవ్ర నిరాశే ఎదురయ్యింది. వివిధ కౌన్సెలింగ్ కేంద్రాలలో ఆదిలోనే కంప్యూటర్లు మొరాయించాయి. మరి కొన్ని చోట్ల ఓపెన్ కావడమే కష్టం కావడంతో కౌన్సెలింగ్ ప్రారంభమే కాలేదు. దీంతో విద్యార్థులు, తల్లితండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ సమస్యలపై చర్చించేందుకు శనివారం సమావేశమైన విద్యామండలి ఎంసెట్ కాన్సెలింగ్ ను పెంచుతున్నట్లు వివరించింది. ఈనెల 30న సీట్ల కేటాయింపు ఉంటుందని వారు వారు చెప్పారు.
News Posted: 1 August, 2009
|