హైదరాబాద్ : ఉప్పల్ రాజ్యలక్ష్మి థియేటర్ వద్ద యువతీయువకుల మృత దేహాలు కలకలం సృష్టించాయి. వీరిద్దరూ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. యువతీయువకుల శవాలు అక్కడ పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియపరిచారు. స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రేమికులుగా అనుమానిస్తున్న ఈ యువతీయువకులు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.