హైదరాబాద్ : నగరంలోని నెహ్రూ జూపార్క్‌లో పులి సందర్శకునిపై పంజా విసిరింది. మద్యం మత్తులో ఉన్న యువకుడు బోనులో ఉన్న పులికి తిను బండారాలు వేయడానికి ఇనుప తీగల కంచె దాటి ఎన్ క్లోజరుకు అతి సమీపంలోకి వెళ్ళడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన బాధితున్ని జూ అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.