హైదరాబాద్ : ఓ విద్యార్థి విద్య నేర్పే లెక్చరర్ నే ప్రేమిస్తున్నానంటూ వేధించడం మొదలు పెట్టాడు. చిలుకూరులోని షాద్ ఇంజనీరింగ్ కళాశాల ఫైనలియర్ విద్యార్థి నితీష్ రెడ్డి ప్రేమ పేరుతో ఓ లెక్చరర్ ను వేధించడం మొదలు పెట్టాడు. నితీష్ రెడ్డి వేధింపులు తాళలేక ఆమె ఉద్యోగం కూడా మానేసింది. తనను ప్రేమించాలంటూ లెక్చరర్ ను వేధిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థిని పంజాగుట్ట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.