ట్రాఫిక్ సమస్యలపై అధ్యయనం హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను క్రమబద్దీకరించేందుకు శాస్త్రీయ అధ్యయనం చేపట్టనున్నట్లు హోమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ట్రాఫిక్ సమస్యలపై సోమవారం ఆమె స్థానిక ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం జరిపారు. నగరంలో రోజుకు 650 కొత్త వాహనాలు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయన్నారు. మున్సిపల్, రవాణా, పోలీస్ ఉన్నతాధికారుల విదేశాల్లో పర్యటించి ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం ఓ సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా హోమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
News Posted: 10 August, 2009
|