హైదరాబాద్ : రౌడీ షీటర్ అయూబ్ ఖాన్ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. పాతబస్తీలోని కిషన్ బాగ్ లో ఆయూబ్ ఖాన్ ను గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన అయూబ్ ఖాన్ పై నగరంలోని పలు పోలీసు స్టేషన్లో అనేక కేసులు ఉన్నాయి.