హైదరాబాద్ : ఉస్మానియా యూనిర్శిటీలో ఓ ప్రొఫెసర్ మద్యం మత్తులో జోగుతూ ఏబీవీపీ కార్యకర్తలకు పట్టుబడ్డారు. జువాలజీ డిపార్టమెంట్ కి చెందిన ప్రొఫెసర్ అశోక్ కుమార్ విధి నిర్వహణలో ఉండగా గంజాయి సేవిస్తూ విద్యార్థులకు పట్టుబడ్డారు. దీంతో ఆయనను వెంటనే విధుల నుంచి తొలగించాలని విద్యార్థుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.