బాలల చలన చిత్రోత్సవాలు హైదరాబాద్ : పదహారవ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవానికి సన్నాహక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి అధ్యక్షతన గల ఈ కమిటీలో 26 మంది సభ్యులుగా ఉంటారు. పార్ధసారధి వైఎస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. సభ్యులుగా ఆదిశేషగిరిరావు డి.సురేష్, రమేష్ ప్రసాద్ తదితరులు ఈ కమిటీలో కొనసాగుతారు. నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకూ హైదరాబాద్ లో అంతర్జాతీయ బాలల చలనచి త్రోత్సవాలు నిర్వహించనున్నారు. చిత్రోత్సవ ఏర్పాట్లపై ఈ కమిటీ చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటుంది.
News Posted: 12 August, 2009
|