హైదరాబాద్ : హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ ఆర్ కే పురంలోని ఆర్మీ అధికారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆర్మీ లో లెఫ్టినెంట్ గా పనిచేస్తున్న ప్రభాంజనేయులు ఆర్కేపురంలో సొంతంగా ఓ ఫ్లాట్ కొని అందులో నివాసం ఉంటున్నారు. ఇంటికి తాళం వేసి గుంటూరు వెళ్ళివచ్చేసరికి ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడుండంతో వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సుమారు రూ.20 లక్షల నగదును దుండగులు అపహరించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.