కరెంట్ షాక్ తో స్నేహితుల మృతి హైదరాబాద్ : పటాన్ చెరు ప్రాంతంలో కరెంట్ షాక్ తో ఇద్దరు యువకులు గురువారం మృతి చెందారు. ఇంజినీరింగ్ కళాశాలలో ట్రిపుల్ ఇ మూడో సంవత్సరం చదువుతున్న శామ్యూల్, ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న విక్రాంత్ అనే స్నేహితులు వర్షం వస్తుందో లేదో అని వారు నివసిస్తున్న ఒకటో అంతస్తు పైనుంచి చేతులు బయట పెట్టారు. దాంతో పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లకు చేతులు తగలడంతో అక్కడికక్కడే విగతజీవులయ్యారు.
News Posted: 13 August, 2009
|