బెల్టు : లోక్ సత్తా హైదరాబాద్ : రంగారెడ్డి, పరిసర జిల్లాల్లో లక్షల కుటుంబాల వారు కల్తీకల్లుకు అలవాటుపడ్డారు. అది అందుబాటులో లేక ప్రాణాలమీదకు తెచ్చుకున్న దారుణ పరిస్థితికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని లోక్ సత్తాపార్టీ డిమాండ్ చేసింది. బెల్టుషాపులు, కల్తీ కల్లు వల్ల కొన్ని లక్షల కుటుంబాలను ఛిద్రం చేస్తూ ఉసురును పోసుకుంటున్నా ప్రభుత్వం మాత్రం మద్యాన్నే ఆదాయమార్గం చేసుకుంటోందన్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని గ్రామాలలో విచ్చలవిడిగా విస్తరించి ఉన్న చాలా బెల్టుషాపుల్లో పంపిణీ అవుతున్న కల్తీ మద్యంవల్ల ప్రజల మానసిక స్థితి ఎలా ఉంటుందో తాజాగా కల్తీకల్లు బాధితుల విచిత్ర ప్రవర్తనను చూస్తే కళ్ళకు కట్టినట్లు అర్థమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణం బెల్టుషాపుల్ని మూసివేయడంతో పాటు మద్యం నిలిపివేసి కఠిన మద్యనియంత్రణ అమలు చేయాలని, డీ ఎడిక్షన్ సెంట్రలను ఏర్పాటుచేసి వ్యసనపరులు కోలుకునేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని లోక్ స్తత్తా, మహిళా సత్తా గీతామూర్తి, మనోరమ, సరోజాదేవి డిమాండ్ చేశారు.
News Posted: 19 August, 2009
|