జేఎన్ టీయూకి బాంబు బూచి హైదరాబాద్: కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూకు శుక్రవారం వచ్చిన బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ కలకలం రేపింది. సమాచారం అందుకున్నపోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందం అక్కడకు చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. సోదానిర్వహించిన వీరు అది బెదిరింపు కాల్ మాత్రమేననీ తేల్చిచెప్పారు. ఫోన్‌కాల్ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయాన్ని వారు ఆరా తీస్తున్నారు.
News Posted: 21 August, 2009
|