'ఆర్ట్ ఫర్ లివింగ్' యోగా శిక్షణ హైదరాబాద్ : ప్రముఖ ఆథ్యాత్మిక గురువు రవిశంకర్ నెలకొల్పిన 'ఆర్ట్ ఫర్ లివింగ్' ఆధ్వర్యాన దిల్ షుక్ నగర్ చైతన్యపురిలోని కంచికామకోఠి రామాలయం ఆవరణలో యోగా తరగతులు నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధి ఎన్ మల్లికార్జున రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 24వ తేదీనుండి 29 వరకు వారు రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 గంటలనుంచి 9 గంటల వరకు ఈ తరగతలు నిర్వహిస్తామని తెలిపారు. యోగా, ప్రాణామాయం, ధ్యానం, సుదర్శన క్రియ తదితర ప్రక్రియల్లో తర్ఫీదు ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు నేరుగా గానీ, ఫోన్ ద్వారా కానీ సంప్రదించాలన్నారు. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ : 9866749268, 9908221380.
News Posted: 22 August, 2009
|