బోగస్ కార్డుల సర్వే ప్రారంభం హైదరాబాద్ : బోగస్ రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం మొదటి విడత సోమవారం నుంచి ప్రారంభం అయ్యింది. జాయింట్ కలెక్టర్ సౌరబ్ గౌరు నేతృత్వంలో ఇంటింటి రేషన్ కార్డుల పరిశీలన నాగులు దశల్లో జిల్లా అంతా సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డులతో పాటు ఇళ్ళు, పింఛన్ల మంజూరిలో చోటు చేసుకున్న లోటుపాట్లపై కూడా ఏకకాలంలో సర్వే నిర్వహించనున్నారు. బోగస్ కార్డుల లబ్ధిదారులను కనిపెట్టడంతో పాటు కార్డులు లేని నిజమైన అర్హలను కూడా ఈ సర్వే ద్వారానే గుర్తిస్తారు. ఇందుకోసం మండలాల వారీగా అధికారుల బృందాలను నియమించారు. అవకతవకలను గుర్తించి, నిజమైన లబ్ధిదారుడికి న్యాయం చేయడం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. మొదటి విడతగా ఐదు మండల్లాల్లో ఈ సర్వే నిర్వహిస్తున్నారు.
News Posted: 24 August, 2009
|