ఐమాక్స్ లో పేపర్ గణేష్ హైదరాబాద్ : వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని పర్యావరణానికి ఏ మాత్రం హాని కలిగించని రీతిలో రూపొందించిన పేపర్ గణేష్ విగ్రహం నగర ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. శ్రోతలను వీనులవిందైన సంగీతంతో, సమాచార విశ్లేషణలతో అలరిస్తూ అగ్రశ్రేణి ఎఫ్‌ఎం స్టేషన్‌గా గుర్తింపు పొందిన బిగ్ 92.7 ఎఫ్‌ఎం వినాయకచవితి వేడుకలను వినూత్నంగా నిర్వహించింది. ఇందులో భాగంగా పర్యావరణానికి ఏ మాత్రం హాని కలిగించని రీతిలో రూపొందించిన పేపర్ వినాయకుని విగ్రహాన్ని నగరంలోని ప్రసాద్ ఐమాక్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సినీనటి ఆర్తి అగర్వాల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నేపధ్య గాయని మాళవిక పలు గీతాలను ఆలపించారు. గణేష్ ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకునే జంటగనరవాసుల కోసం బిగ్ ఎఫ్‌ఎం మొదటిసారిగా కాగితపు వినాయకుడిని ప్రతిష్టించింది. ప్రజల కోసం, ప్రజల తరపున చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి పేపర్‌ను ప్రజలనుంచే సేకరించింది. ఈనెల 31 వ తేదీ వరకు ఈ పేపర్ గణేష్ విగ్రహాన్ని సందర్శనార్ధం ఐమాక్స్ లో ఉంచుతారు.
News Posted: 24 August, 2009
|