ఖైరతాబాద్ లో మత్స్య గణేష్ హైదరాబాద్ : వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ఖైరతాబాద్ లో భారీ మత్స్య వినాయకుడు కొలువై భక్తుల పూజలను అందుకుంటున్నాడు. ఆదివారం సాయంత్రం మంత్రి దానం నాగేందర్, ఎంపీ అంజన్ కుమార్, ఎమ్మెల్యే విష్ణవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొని పూజలు చేసి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. గణేషుడు ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వర్షాలు కురింపించాలని మంత్రి ఆకాంక్షించారు. ఖైరతాబాద్ లోనే పుట్టిన తాను ఒకప్పుడు ఉత్సవాల్లో సభ్యుడిగా పాల్గొన్నాని... ప్రస్తుతం మంత్రిగా పాల్గొనడం గణపయ్య కరుణేనని అన్నారు. ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఖైరతాబాద్ వినాయకుడి ప్రాధాన్యాన్ని వివరించారు. దేశంలోనే ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న వినాయకుల్లో ఇదొకటన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు, స్థానికేతలు సుదర్శన్, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
News Posted: 24 August, 2009
|