గోకుల్ థియేటర్ వద్ద ఘర్షణ హైదరాబాద్: ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్ వద్ద మంగళవారం రౌడీ మూకలు కర్రలతో దాడులు చేససుకుంటూ ఘర్షణకు దిగారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువర్గాలూ రాళ్లు, కత్తులు, కర్రలతో దాడులు చేసుకోవటంతో హబీబ్ అనే యువకుడికి కత్తిపోట్లు తగిలాయి. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పాతకక్షల కారణంగానే ఈ దాడి జరిగినట్లు సమాచారం. పోలీసులు ఇరువైపుల వారిని అదుపులోకి తీసుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
News Posted: 25 August, 2009
|