పిఆర్పీ అభ్యర్థి ప్రచారం షురూ హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని ప్రజారాజ్యం పార్టీ మిగతా పార్టీలన్నింటి కంటే ముందుగానే ప్రారంభించింది. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించిన అనంతరం ఆ పార్టీ జూబ్లీహిల్స్ డివిజన్ అభ్యర్థిని ఎం. అనురాధ రాజు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తమ తొలి అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నుంచి అనురాధ రాజును పార్టీ అధినేత చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా రామానాయుడు ఫిలిం స్టూడియో అధినేత డి. రామానాయుడిని కలిసి వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభారాణి, పిఆర్పీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, రమాదేవి, రేణుక, ఆవుల వాణి. అల్లు సత్యవతి, జయ తదితరులు పాల్గొన్నారు.
News Posted: 27 August, 2009
|