బాబుతో కరణం మల్లీశ్వరి భేటీ

హైదరాబాద్ : భారత హాకీ మాంత్రికుడు స్వర్గీయ ధ్యాన్ చంద్ 104వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారంనాడు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని మహిళా వెయిటి లిఫ్టర్ కరణం మల్లీశ్వరి ఆయన నివాసంలో కలుసుకొని మాట్లాడారు. నగరంలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఈ తెలుగింటి ఆడపడుచు, 2000 సంవత్సరపు సిడ్నీ ఒలిపింక్స్ మహిళల వెయిటి లిఫ్టింగ్ లో మన దేశానికి ఒకే ఒక కాంస్య పతకాన్ని మల్లీశ్వరి సాధించిపెట్టిన విషయం తెలిసిందే. ధ్యాన్ చంద్ పుట్టిన రోజు సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించుకుంటున్న సందర్భంగా మల్లీశ్వరి చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హాకీ దిగ్గజం, మాజీ ఒలింపియన్ మేజర్ ధ్యాన్ చంద్ హాకీలో చూపిన నైపుణ్యాన్ని దేశ, విదేశాల్ో కొనియాడారన్నారు. 1928, 32, 36 సంవత్సరాల్లో వరుసగా మూడు ఒలింపిక్స్ లో ధ్యాన్ చంద్ తన అద్భుత క్రీడా నైపుణ్యంతో దేశానికి హాకీలో 3 బంగాలు పతకాలు సాదించి పెట్టాడని కొనియాడారు. జట్టును సమష్టిగా నిలపడంలో కూడా ధ్యాన్ చంద్ కృతకృత్యుడయ్యాడన్నారు. దేశ హాకీ రంగానికి ఎనలేని సేవలు అందించిన మహనీయుడు ధ్యాన్ చంద్ కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబును మల్లీశ్వరి కలిసినప్పుడు శాప్ మాజీ చైర్మన్ పి.ఆర్. మోహన్ కూడా ఆమె వెంట ఉన్నారు.
News Posted: 31 August, 2009
|