హైదరాబాద్ : ఎమ్మెల్యే రామారావు సోమవారం సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడాన్ని ఆయన నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. తనపై పెట్టిన కేసులతో తాను కేరాఫ్ ఫ్లాట్ ఫాంగా మారానని ఆయన అన్నారు. నర్సింగ్ విద్యార్థినులు దళితులే అన్న విషయం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా సెల్ వద్ద ఆయన మాట్లాడుతూ హోంమంత్రి తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు. ప్రభుత్వ వివరణకు రామారావు అభ్యంతరం వ్యక్తం చేశారు.