రూ.కోటికి మహిళ టోకరా హైదరాబాదు : ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ మహిళ స్థానిక నిరుద్యోగులను నమ్మించి కోటి రూపాయలకు పైగా టోపి పెట్టిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. కూకట్‌పల్లికి చెందిన ఉషారాణి స్థానిక నిరుద్యోగులకు వల వేసి ఒక్కొక్కరి నంచి లక్షలాది రూపాయలు వసూలు చేసింది, ఇళ్ళు ఇప్పిస్తానని అందర్నీ నమ్మించి డబ్బులు వసూలు చేసింది. రాత్రికి రాత్రే వసూలు చేసిన సొమ్ముతీసుకుని కుటుంబంతో సహా బిచాణా ఎత్తేసింది. దీంతో బాధితులు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు.
News Posted: 1 September, 2009
|