కుప్పకూలిన ప్రభుత్వాసుపత్రి హైదరాబాద్ : ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల అమీర్ పేటలో ఉన్న ఓ ప్రభుత్వాసుపత్రి భవనం కుప్పకూలింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆస్పత్రి సిబ్బంది పేర్కొన్నారు. ఆస్పత్రి భవనం 60 ఏళ్ళ నాటిది కావడంతో అధికారులు సరైన మరమ్మతులు చేయించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాల తాకిడికి ఆ భవనం తట్టుకోలేక కుప్పుకూలి పోయిందనీ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి నగరంలో ఇటువంటి భవనాలు చాలా ఉండడంతో వాటికైనా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News Posted: 1 September, 2009
|