5న 107 మంది టీచర్లకు అవార్డులు హైదరాబాద్ : ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఈనెల 5న రవీంద్ర భారతిలో రాష్ట్ర మాద్యమిక, ఉన్నత, సాంకేతిక, ప్రాధమిక విద్యాశాఖల మంత్రుల చేతులమీదుగా 107 మంది ఉపాధ్యాయులు అవార్డులను అందుకోనున్నారు. 2009 సంవత్సరపు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు గాను 107 మంది ఎంపిక అయ్యారు. వీరిలో స్టేట్ టీచర్ అవార్డులకు గాను 59 మంది, నేషనల్ ఫౌండేషన్ స్కీమ్ అవార్డులకు మరో 48 మంది ఎంపిక అయ్యారు. ఉత్తమ టీచర్ కు గోల్డ్ కోటెడ్ మెడల్, శాలువా, వెయ్యి రూపాయల నగదు ప్రదానం చేయనున్నట్లు పాఠశాల విద్యాకమిషనర్ పూనం మాలకొండయ్య తెలిపారు.
News Posted: 2 September, 2009
|