మధురిమకు న్యాయం చేయండి హైదరాబాద్ : ఎన్నారై వేధింపులకు గురైన మహిళకు న్యాయం చేయాలని మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ బి. సుభాషణ్ రెడ్డి, డిజిపి ఎస్సెస్పీ యాదవ్ లకు మహిళా సత్తా విజ్ఞప్తి సోమవారం విజ్ఞప్తి చేసింది. భార్యను వేధించి తీవ్ర అనారోగ్యం పాలు చేయడంతో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా వేధిస్తున్న ఆ ప్రవాసాంధ్రునిపై తగిన చర్యలు తీసుకోవాలని లోక్ సత్తా మహిళా విభాగం ఫిర్యాదు చేసింది. మానవహక్కుల సంఘం చైర్మన్ ను, డిజిపిని కలిసిన బృందంలో మహిళా సత్తా రాష్ట్ర కన్వీనర్ ఎన్.సరోజాదేవి, లోక్ సత్తా అధికార ప్రతినిధి కె. గీతామూర్తి, సుధాబాల, గజానని, ఎన్. సుభాషిణి, పార్టీ లీగల్ విభాగం రాష్ట్ర కన్వీనర్ సివిఎల్ నరసింహారావు తదితరులున్నారు.
విశాఖఫట్నంలోని పెదవాల్తేరుకు చెందిన మధురిమను ఆమె భర్త బారు జార్జి చక్రవర్తి కట్నం కోసం వేధించాడంటూ మీడియాలో వచ్చిన కథనాలు, విశాఖపట్నం లోక్ సత్తా కార్యకర్తలు తెలియజేసిన సమాచారం ప్రకారం మహిళా సత్తా ఈ ఫిర్యాదు చేసింది. వైద్యం నెపంతో మధురిమకు జార్జి చక్రవర్తి ఇచ్చిన మందులు ఆమె ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీశాయని మహిళా సత్తా తన ఫిర్యాదులో పేర్కొంది. జార్జి చక్రవర్తి అకృత్యాలపై నిష్పాక్షకంగా విచారణ జరిగేలా చూడాలని, బాధితురాలికి న్యాయం చేయాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.
News Posted: 7 September, 2009
|