హైదరాబాద్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం పరామర్శించారు. ఆయనతో పాటు మరికొంతమంది టిడిపి నేతలు సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ కుటుంబసభ్యులను కలిసి సానుభూతిని తెలిపారు. వైఎస్ అకాల మరణం రాష్ట్రానికి తీరని లోటని ఆయన అన్నారు. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు తాను ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నందున రాలేకపోయానని అన్నారు. నిన్న రాత్రే భారతదేశానికి వచ్చానని ఆయన మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం వైఎస్ ఎంతో కృషి చేశారన్నారు.