కొడుకుతో తల్లి ఆత్మహత్య హైదరాబాద్ : భార్యాభర్తల మధ్య జరిగన గడొవలో తల్లితోపాటు రెండేళ్ళ కుమారుడి ప్రాణాలు కూడా అనంతవాయువుల్లో కలిసిపోయాయి. హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ బాలమురళీకృష్ణ తన భార్య విజయరాణితో గొడపడి చేయిచేసుకున్నాడు. దీంతో ఆమె తన రెండేళ్ళ కొడుకుతో సహా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. పోస్ట్ మార్టం కోసం వారి శవాలను గాంధీ ఆస్పత్రి తరలించారు. మురళీకృష్ణ భార్యా, కొడుకుల శవాలను చూసి తట్టుకోలేక గాంధీ ఆస్పత్రి భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాత్నానికి పూనుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 8 September, 2009
|