హైదరాబాద్ : గిరిజన నిరుద్యోగులకు హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేక స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. గిరిజన సంక్షేమ శాఖలో ఓ ముఖ్యమైన పథకానికి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టే అవకాశం ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 10 ఐటీడిఏలతో పాటు రాష్ట్రంలో మరో మూడు ఐటీడీఏలను ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు. గిరిజనులందరికీ అటవీ భూమిపై హక్కును కల్పిస్తూ చేపట్టిన మహత్తర కార్యక్రమం పూర్తయిందని ఆయన తెలిపారు. గిరిజనుల సంక్షేమం కోసం వైఎస్ ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు.