పేదల పెన్నిధి వైఎస్ : ప్రణీత హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఎందరో పేద ప్రజలు లబ్ధిపొందారనీ, వైఎస్ నిజమైన రియల్ హీరో అని యాసిడ్ దాడిలో గాయపడి కోలుకున్న ప్రణీత అన్నది. ఎన్ ఎస్ యూఐ ఆధ్వర్యంలో గాంధీభవన్ లో గురువారం జరిగిన వైఎస్ సంతాప సభలో ఆమె పై విధంగా మాట్లాడింది. తనపై యాసిడ్ దాడి జరిగినప్పుడు వైఎస్ తనకు ఎంతో మనో ధైర్యాన్ని కల్పించారని ఆమె అన్నారు. ఆయన మరణ వార్త విన్నప్పుడు తట్టుకోలేక ఏడ్చేశానని వరంగల్ యాసిడ్ దాడి బాధితురాలు ప్రణీత అన్నారు. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ఆమె కోరింది.
News Posted: 10 September, 2009
|