చిరు వ్యాపారులకు ఐడీ కార్డులు హైదరాబాద్ : రాష్ట్రంలోని చిరు వ్యాపారులకు చట్టబద్దత కల్పించేందుకు ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. వారి భత్రత, ప్రయోజనం కోసం ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగిన తోపుడు బండ్ల వ్యాపారుల సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు పట్టణాభివృద్ది శాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు. ఈ నెలాఖరులోగా సర్వేను పూర్తి చేస్తామన్నారు. వారి ప్రయోజనాలకోసం గుర్తింపు కార్డులతో పాటు పావలా వడ్డీ రుణాలు, ఇళ్ళస్థలాలు కల్పించేలా చట్టం తీసుకువస్తామని మంత్రి తెలిపారు. ప్రత్యేక చట్ట రూపకల్పన కోసం చిరు వ్యాపారుల సంఘం ఎన్జీవోల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
News Posted: 11 September, 2009
|