జగన్ ను కలసిన భారతి హైదరాబాద్ : టెక్కలి ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి కొర్ల భారతి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ ను కలిశారు. వైఎస్ కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. తన విజయానికి సహకరించినందుకు జగన్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్ సంక్షేమ పథకాలు, జగన్ పిలుపే తనను గెలిపించాయన్నారు. అలానే ఆమె ముఖ్యమంత్రి రోశయ్యను సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రోశయ్య ఆమెను టెక్కలి ఉపఎన్నికల్లో గెలుపొందినందుకు అభినందించారు. నియోజకవర్గం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి రోశయ్య వారికి సూచించారు. ఆమెతోపాటు జిల్లా ఎంపీకృపారాణి, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జిల్లానేతలు తదితరులు సీఎం ను కలిశారు.
News Posted: 15 September, 2009
|