హైదరాబాద్ : ప్రభుత్వం స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేత ఉద్రిక్తతలకు దారి తీసింది. రంగారెడ్డి జిల్లా జవహర్ నగర్ లో మంగళవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. కట్టడాల కూల్చివేతను నిరసిస్తూ ఓ మహిళ ఆత్మహత్యా యత్నానికి పూనుకోవడంతో స్థానికులు అధికారులను నిర్భందించారు దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.