ఎల్‌ఐసీ ఉద్యోగుల సమ్మె హైదరాబాదు : జీవిత భీమా సంస్థ (ఎల్‌ఐసీ) ఉద్యోగులు వేతన సవరణలో జాప్యాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా సమ్మెను చేపట్టారు. ఈ సమ్మెలో భాగంగా జంటనగరాల ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. 2007 ఆగస్టు 1న జరగవలసిన వేతన సవరణ ఇప్పటివరకు జరగలేదని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా సమ్మె నిర్వహిస్తున్నట్లు ఎల్‌ఐసీ ఎంప్లాయ్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు.
News Posted: 16 September, 2009
|