హైదరాబాద్ : విధులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ కార్మికులు లారీ ఢీకొని దుర్మరణం పొందారు. గురువారం రాత్రి లారీ అదుపు తప్పి విధులు నిర్వహిస్తున్న వీరిపై దూసుకుపోయింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. నాంపల్లి స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన సంభవించింది. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.