హైదరాబాద్ : ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తన అసెంబ్లీ నియోజకవర్గమైన తిరుపతిలో పర్యటించారు. తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించడంతో పాటు ప్రియదర్శినీ కూరగాయల మార్కెట్ ఆధునీకరణ పనులు చూశారు. వ్యాపారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో విషజ్వరాల నివారణకు అవసరమైన చొరవను ప్రభుత్వం చూపాలన్నారు. ముఖ్యమంత్రి రోశయ్యకు మంత్రులు సహకరిస్తే అభివృద్ది సాధ్యమవుతుందని ఆయన అన్నారు