భార్యపై గొడ్డలితో భర్త దాడి హైదరాబాద్ : కట్టుకున్న భార్యన్న కనికరం లేకుండా గొడ్డలితో దాడి చేశాడో కసాయి భర్త. అనుమానం హద్దుమీరటంతో కట్టుకున్న భార్యను గొడ్డలితో దాడి చేసి, ఆపై అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ పార్శీగుట్టలో ఈ దుర్ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భర్త మరణించగా, గాయపడిన భార్య పరిస్థితి విషమంగా ఉంది.
News Posted: 18 September, 2009
|