సికింద్రాబాద్ : రాష్ట్రంలో యాసిడ్ దాడులకు అంతు లేకుండా పోతోంది. ఎప్పుడూ ఆడవారిపైన జరిగే యాసిడ్ దాడి ఈ సారి ఓ యువకునిపై జరిగింది. స్థానిక అడ్డాగుట్ట ప్రాంతంలో రమేష్ అనే యువకునిపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న అర్ధరాత్రి యాసిడ్ పోశారు. తీవ్రగాయాలతో రక్షించండి అని బాధితుడు అరవడంతో స్పందించిన స్థానికులు 108 ఆంబులెన్స్‌కు సమాచారమందించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రమేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడికి దారితీసిన కారణాలకోసం పోలీసులు ఆరాతీస్తున్నారు.