ఘనంగా రంజాన్ వేడుకలు హైదరబాద్ : ప్రపంచవ్యాప్తంగా ముస్లీం సోదరులు పవిత్ర రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. బంగ్లాదేశ్ లో ప్రార్థనా మందిరాలు కిక్కిరిసిపోయాయి. ముస్లీం సోదరులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాష్టప్రతి ప్రతిభాపాటిల్, ప్రధాని మన్మోహన్, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీతో పాటు పలువురు మంత్రలు, రాజకీయ ప్రముఖులు ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దివంగత వైఎస్ కుమారుడు జగన్, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, పీసీసీ చీఫ్ డి. శ్రీనివాసులు, రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, మంత్రులు రాష్ట్ర ప్రజానికానికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
News Posted: 21 September, 2009
|