హైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ ముని మనుమడు తుషార్ గాంధీ 'మహాత్మ' చిత్రం ఆడియో విడుదలకు సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ రాగానే ముందుగా బాపూ ఘాట్ ను సందర్శించి జాతిపితకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిని ప్రబోధించే ఎలాంటి కార్యక్రమాలకైనా తాను ప్రోత్సహిస్తానని తెలిపారు. తనకు రాజకీయాలు సరిపడవని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మహాత్ముని ఆశయాలు కనుమరుగవుతున్నాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.