జగన్ కు జనార్ధన్ రెడ్డి పరామర్శ హైదరాబాద్ : కడప ఎంపీ, దివంగత ముఖ్యమంత్రి తనయుడు వైఎస్ జగన్ ను కర్నాటక టూరిజం శాఖ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కలిసి పరామర్శించారు. ఇడుపుల పాయకు ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చిన ఆయన జగన్ ను కలసిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జగన్ పరామర్శించిన తరువాత ఆయన తిరిగి బెంగళూరు వెళ్ళిపోయారు. జగన్ ను రోజా కూడా సోమవారం పరామర్శించారు. తర్వాత వైఎస్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు.
News Posted: 21 September, 2009
|