టిడిపిలోకి బిజెపి నాయకులు

హైదరాబాద్ : ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్ కు చెందిన బిజెపి నాయకులు కె.రవిశంకర్, సిహెచ్. శబరీనాథ, ఎం. రాజేష్ రెడ్డి, కామేశ్వరరావు, కె. ఫణికుమార్, జె.గగన్ పాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చంద్రబాబు నాయుడి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. బిజెపికి రాజీనామా చేసిన వారంతా బుధవారంనాడు ఎన్టీ ఆర్ ట్రస్ట్ భవన్ జరిగిన కార్యక్రమంలో టిడిపి తీర్థం తీసుకున్నారు.
బిజెపి నాయకులను టిడిపిలోకి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించేందుకు విశేషంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి సత్తా ఏమిటో చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జిట్టా రాజశేఖరరెడ్డి, ఎల్బీనగర్ టిడిపి ఇన్ చార్జి ఎస్.వి. కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
News Posted: 24 September, 2009
|