శాస్త్రవేత్తలకు బాబు శభాష్ హైదరాబాద్ : పిఎస్ఎల్వీ సి 14 అంతరిక్ష నౌకను విజయవతంగా ప్రయోగించిన శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా ఓషన్ శాట్ ను సక్సెస్ ఫుల్ గా కక్ష్యలో ప్రవేశపెట్టిన వారి మేధను ఆయన కొనియాడారు. భారత శాస్త్రవేత్తల నైపుణ్యానికి, అత్యాధునిక, అత్యద్భుత సాంకేతిక పరిజ్ఞానానికి ఈ చారిత్రక విజయం ప్రతీక అని ఆయన ప్రశంసించారు. తెలుగు గడ్డపై నుంచి ఈ ప్రయోగం విజయవంతం కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. పిఎస్ ఎల్వీ సి 14 ప్రయోగం నుంచి మన యువత, యువ శాస్త్రవేత్తలు స్ఫూర్తి పొంది ఉన్నతాశయాలతో మరిన్ని ప్రయోగాలను విజయవంతంగా చేసి దేశం, రాష్ట్రాల ప్రగతికి దోహదం చేయాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.
News Posted: 24 September, 2009
|