'అత్యాచారాల పై కళ్లు తెరవండి' హైదరాబాద్ : 21వ శతాబ్దంలో కూడా భ్రూణహత్యలు, ఆడపిల్లలమీద అత్యాచారాలు కొనసాగడం సభ్యసమాజానికి అవమానమని, అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఇలాంటి దుస్థితిని సరిదిద్దేంకు కఠిన చర్యలు తీసుకోవాలని లోక్ సత్తా పార్టీ మహిళా విభాగం రాష్ట్ర స్త్రీ, శిసుసంక్షేమ శాఖామంత్రి మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో కలిసి విజ్ఞాపనపత్రం సమర్పించింది. సంక్షేమ హాస్టళ్లల్లో వార్డెన్లే దురాగతాలకు పాల్పడుతున్నారని, పేద బాలికల చేత వెట్టి చాకిరీలు చేయించుకుంటున్నారని ఇటువంటి వారిపై త్వరితగతిన విచారణ జరిపి మరణశిక్ష విధించేలా చట్టసవరణ చేయాలన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరు ఉదాసీనంగా ఉందని, వీటి మీద హామీలతో కాలక్షేపం చేయకుండా కఠని చర్యలు ప్రారంభించి పురుషాధిక్యవాదులకు హెచ్చరికలా వ్యవహరించాలని మహిళాసత్తా నేతలు కోరారు. మహిలాసత్తా రాష్ట్ర కన్వీనర్ ఎన్ సరోజాదేవి, గ్రేటర్ హైదరాబాద్ విభాగం అధ్యక్షురాలు టి పద్మజారాణి, ఎస్ వి గజానని, వాణి, మధురాదేవి, వెంకటేశ్వరి, విమలాదేవి తదితరులు మంత్రి సురేఖను కలుసుకున్నారు.
News Posted: 24 September, 2009
|