స్వైన్ ఫ్లూతో విద్యార్థి మృతి హైదరాబాద్ : రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య పెరుగుతోంది. జూబ్లీహిల్స్ లో ఉన్న అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువకుడు గురువారం స్వైన్ ఫ్లూవ్యాధితో మరణించాడు. ఈ యువకుడి పేరు ఇంతియాజ్ అని, అతను నిజాం కళాశాల విద్యార్థి అని తెలుస్తోంది. చంచల్ గూడ నివాసి అయిన ఇంతియాజ్ కొన్ని రోజుల క్రితం చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు.
News Posted: 24 September, 2009
|