హైదరాబాద్ : మహిళలపై యాసిడ్ దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హోమంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళపై యాసిడ్ దాడులకు పూనుకున్నవారికి మూడు సంవత్సరాలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించేందుకు రెండు ప్రత్యేక ఆర్డినెన్స్ లు తీసుకురానున్నట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.