ఈఎన్ టీ వైద్యుల సేవ బంద్ హైదరాబాద్ : ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూములను ప్రభుత్వమే అన్యాక్రాంతం చేస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలంటూ ఈఎన్ టీ వైద్యులు విధులను బహిష్కరిస్తూ తమ నిరసనను తెలిపారు. హైదరాబాద్ కోఠీలోని ఈఎన్ టీ ఆసుపత్రి భూములను కబ్జా దారుల నుంచి కాపాడుకునేందుకు స్వయంగా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది రంగంలోకి దికారు. ఈ తరహా చర్యలు మానుకోకపోతే ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.
News Posted: 25 September, 2009
|