హైదరాబాద్ : రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. స్వైన్ ఫ్లూ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు మంగళవారం మరణించారు. దీంతో స్వైన్ ఫ్లూ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 50 మందికి చేరింది. అకారణ వర్షాల వల్ల స్వైన్ ఫ్లూ త్వరగా వ్యాపిస్తుందోమోనని నగర ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.