హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని జింఖానా మైదానంలో శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రముఖ ఆథ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రోశయ్యతో పాటు అఖిల భారత బ్రహ్మకుమారీల ప్రధాన కార్యదర్శి రాజయోగి బ్రహ్మకుమార్ నిర్వాయర్ హాజరవుతారని వారు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.