చెరువులో దూకిన తల్లీ కూతుళ్ళు హైదరాబాద్ : ఫిల్మ్ నగర్ చెరువులోకి దూకి తల్లీ కూతుళ్ళు గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కుమార్తె మరణించగా, తల్లి వరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా వీరిని సౌందర్య, పుల్లమ్మగా పోలీసులు గుర్తించారు. అయితే వీరి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. కేసును బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 1 October, 2009
|