టిడిపికి నేషనల్ లీగ్ మద్దతు

హైదరాబాద్ : మైనారిటీల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎంతగానో కృషి చేసిందని ఇండియన్ నేషనల్ లీగ్ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ మహ్మద్ సులేమాన్ పేర్కొన్నారు. సులేమాన్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ప్రతినిధి బృందం తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో గురువారంనాడు టిడిపి ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల తమకు పూర్తి విశ్వాసం ఉందని, తెలుగుదేశం పార్టీకి తమ పూర్తి సంఘీభావాన్ని సులేమాన్ ప్రకటించారు. టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.ఎ. హకీం, హైదరాబాద్ నగర శాఖ ఉపాధ్యక్షుడు డిపిరెడ్డి వీరి వెంట ఉన్నారు. బృందంలో నేషనల్ లీగ్ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అల్లావుద్దీన్ అన్సారీ, కేరళ శాఖ కార్యదర్శి అహ్మద్ దేవర్ కోవి, హమీదియా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఇక్బాల్ బాబా కమ్లియా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.జి. అన్సారీ ఉన్నారు.
News Posted: 1 October, 2009
|